కరీంనగర్ సీఎం కేసీఆర్ కు చాలా ఇష్టమైన నగరం: గంగుల

కరీంనగర్ లో అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోయిందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను ,డ్రైనేజీలను విస్తరించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. పట్టణ ప్రగతి పురోగతి పై మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి…పట్టణ ప్రగతిలో గుర్తించిన  పనులకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

డివిజన్ ల వారిగా ప్రత్యేక అధికారులు ,ఏఈ లు ప్రభుత్వానికి ప్రణాళికలివ్వాలన్నారు. అధికారులు కూడా ప్రభుత్వం లో భాగమేనని,  మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ,ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమన్వయం చేసుకొని అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా తప్పకుండా రోడ్డు విస్తరణ చేయాలన్నారు. టాయిలెట్స్ , పార్కులు ,జిమ్ లకు  స్థలాలను గుర్తించాలని చెప్పారు.

కరీంనగర్ పట్టణం ముఖ్యమంత్రి కేసీఆర్ కి చాలా ఇష్టమైన నగరమని చెప్పిన గంగుల.. నగరంలోని చాలా సమస్యలకు పరిష్కారం చూపించామని ఈ కార్యక్రమంలో చెప్పారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ముఖద్వారం అయిన సదాశివపల్లి ,తిమ్మాపూర్ ప్రాంతాల్లో కమాన్ లని నిర్మించాలన్నారు.

Latest Updates