మేం ఎవరినీ బెదిరించలే.. మా నాయకులు బుజ్జగించారంతే

రెబల్ అభ్యర్థులను ఎక్కడా  తాము బెదిరించలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. రేకుర్తిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని బ్రతిమాలి నామినేషన్ విత్ డ్రా చేయించేందుకే మా నాయకులు ఫోన్ లో మాట్లాడారు.. అంతేగానీ మేము ఎక్కడా ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎంఐఎంకు తాము మేయర్ పదవి ఇస్తామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 10 డివిజన్లలో పోటీ చేసే ఎంఐఎంకు  మేయర్ పదవి ఎలా ఇస్తామనుకుంటున్నారని ప్రశ్నించారు.  కరీంనగర్ లో తమ మేయర్ అభ్యర్థిని కేసీఆరే నిర్ణయిస్తారని..సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వస్తే  వారే మేయర్ అని అన్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదలందరికీ ఎందుకు ఇళ్లు కట్టివ్వలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీలకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు.

Latest Updates