గోనె సంచులు బయటోళ్లకు అమ్మితే చర్యలు: వీ6, వెలుగు కథనంపై మంత్రి గంగుల స్పందన

సంచులపై ప్రత్యేక లోగోను ముద్రించే ఆలోచన చేస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేసే గోనె సంచులను మిల్లర్లు, రేషన్ డీలర్లు దళారులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సంస్థ సప్లై చేసే గన్నీ బ్యాగులను తిరిగి సంస్థకు మాత్రమే అమ్మేలా రూల్స్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ‘గోనె సంచుల స్కాం.. ఆరేండ్లలో 620 కోట్లు లూటీ’ పేరుతో ‘వెలుగు’ ప్రచురించిన కథనంపై మంత్రి స్పందించారు. కార్పొరేషన్ కు నష్టం రాకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. బయటి వాళ్లకు అమ్మితే గుర్తుపట్టేలా సంచులపై ప్రత్యేక లోగో ముద్రించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దళారులకు సహకరించే ఆఫీసర్లను సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. సంస్థ సరఫరా చేసే సంచులు తిరిగి ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. నాణ్యత లేని సంచులు సరఫరా చేసిన వ్యాపారుల బిల్లులను నిలిపివేయాలని ఆదేశించారు.

Latest Updates