ఎఫ్.సి.ఐ గోదాములన్నీ నిండిపోయాయి

ఎఫ్.సి.ఐ గోదాములన్నీ నిండిపోయాయి

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గతేడాది కంటే 30శాతం అధికంగా ధాన్యం సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రైతుల అంకౌట్లలో 5వేల 447 కోట్ల రూపాయలు జమచేశామన్నారు. 6వేల 775 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామన్నారు. కరోనా సంక్షోభంలోనూ వానాకాలం వడ్ల కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. 

తెలంగాణలో ఎఫ్.సి.ఐ గోదాములన్నీ నిండిపోయాయన్నారు మంత్రి గంగుల. సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ గోదాములు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఎఫ్.సి.ఐ గోడౌన్లను లీజుకు తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి, ఎఫ్.సి.ఐకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు గంగుల.