కేంద్రం ఇస్తున్న నిధులపై హరీష్ కు స్పష్టత లేదు: డీకే అరుణ

కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి కేటాయిస్తున్ననిధులపై మంత్రి హరీష్ రావుకు స్పష్టత లేకపోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మీడియా ముందుకు వచ్చి అరవడం తప్ప ఆయన చేసేదేమీ లేదన్నారు. హరీష్ రావు తన పేరును అరిచేరావుగా మార్చుకుంటే మంచిదని సూచించారు. కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు వస్తారని… దానికి కేసీఆర్ సిద్ధమేనా అని హరీష్ కు సవాల్ విసిరారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతో ఓటర్లను హరీష్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.డబ్బు, అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు డీకే అరుణ.

Latest Updates