టెక్నాలజీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువద్దు

సిద్ధిపేట జిల్లా : నేటి తరం వేద పరిరక్షణకు కృషి చేయాలని, టెక్నాలజీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువ వద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు.  సిద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు  మాట్లాడుతూ.. సిద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభలు జరుపడం అదృష్టమని అన్నారు.  4 రోజులపాటు సిద్ధిపేట వేదఘోషతో సుభిక్షమవుతుందని, వేద పరిరక్షణకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు

వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు మంత్రి హరీశ్ రావు. వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గొప్ప భక్తుడు, ధార్మిక సేవా తత్పరుడు అయినందున తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయుత చండీయాగం నిర్వహించారన్నారు. తెలంగాణ లోని ప్రాచీన దేవాలయాలయాలను సీఎం పునరుద్ధరిస్తున్నారని, దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వ నిధిద్వారా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల అర్చకులకు ధూప దీపనైవేద్యం పథకం కింద వేతనాలు అందిస్తున్నామన్నారు. ధార్మిక, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు.

minister harish rao at Veda vidwan mahasabaha in Siddipet district

Latest Updates