మీ పార్టీ కార్యకర్తలే మీ బిల్లును వ్యతిరేకించిండ్రు

సిద్దిపేట: బీజేపీ చేస్తున్న‌ అబద్దపు ప్రచారాలన్ని రేపటి నుంచి ఎల్ఈడీ స్క్రీన్ పెట్టి ఊరూరు ప్రచారం చేయిస్తామ‌ని అన్నారు మంత్రి హ‌రీష్ రావు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ప‌ర్య‌టించారు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… వెనుకట చంద్రబాబు మీటర్లు పెడుతనంటే జనమంతా ఆయనకు మీటర్లు పెట్టిండ్రు. ఇప్పుడు బీజేపీ కి కూడా అదేవిధంగా మీటర్లు పెడుతారు. మీ పార్టీ కార్యకర్తలే మీరు ప్రవేశపెట్టే మీటర్ల బిల్లు ను వ్యతిరేకించిండ్రు అని మంత్రి గుర్తు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. మంత్రి హ‌రీష్ ‌సమక్షంలో హబ్సీపూర్, ధర్మాజీపేట గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్ర‌జ‌లు టీఆర్ఎస్ లో చేరారు.

Latest Updates