వీడియో: టీ20లో అదరగొట్టిన మంత్రి హరీశ్

నిన్నమొన్నటిదాకా ఎన్నికల హడావుడిలో ఫుల్ బిజీగా గడిపిన మంత్రి హరీశ్ రావు బుధవారం క్రికెట్ ఆడారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారు. ఆయన హుషారుగా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్టేడియం అరుపులు కేకలతో హోరెత్తింది. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ టీమ్,హైదరాబాద్ మెడికోవర్ హస్పిటల్ టీమ్ ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో హరీశ్.. సిద్దిపేట టీమ్ కు కెప్టెన్సీ చేయగా.. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ టీమ్ మెంబర్ గా ఆడారు. బుధవారం సిద్దిపేట మినీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు ఆడియన్స్ భారీగా వచ్చారు. ఈ మ్యాచ్ లో మంత్రి హరీశ్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేశారు.  ఈ మ్యాచ్ లో సిద్దిపేట జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది.

Latest Updates