అందరికీ సంఘాలున్నాయి కానీ రైతులకు మాత్రం ఏ సంఘం లేదు

దేశంలో అందరికీ సంఘాలున్నాయి కానీ, రైతులకు మాత్రం ఏ సంఘం లేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన అన్నారు. ‘ఎన్నికల‌ వేళ అన్ని పార్టీలు రైతుల కోసం మాట్లాడతాయి. కానీ, యాభై ఏళ్లయినా రైతుల పరిస్థితి మారలేదు. గత సీఎంలు వ్యవసాయం దండగ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. కాలం అయినా కాకున్నా, కరెంటు ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చింది. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మీద 35 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో ఇంత‌ ఖర్చు ‌చేస్తోన్న రాష్ట్రం‌ తెలంగాణ మాత్రమే’ అని ఆయన అన్నారు.

For More News..

రైతుల ట్రాక్టర్ ర్యాలీలో కాల్పులకు ప్లాన్.. నిందితుడిని పట్టుకున్న రైతులు

బిల్డింగులు కట్టుకోండి.. ఎవడు ఆపుతడో చూస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఫోన్ ఉంటేనే రేషన్.. బయోమెట్రిక్ బదులు ఓటీపీ సిస్టమ్

Latest Updates