TRSకు ఓటెయ్యకపోతే మీ సంగతి చూస్తా: ఇంద్రకరణ్ రెడ్డి

పరిషత్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ నేతలు హద్దులు దాటుతున్నారు.  టీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే అభివృద్ధి జరగదని  ఇప్పటికే పలువురు నేతలు హెచ్చరించారు. లేటెస్ట్ గా  TRSకు ఓటేయ్యకపోతే సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ రూరల్ మండలం.. ముత్తాపూర్ లో ఆయన ప్రచారం చేశారు. ఈసారి కారు గుర్తుకు ఓటెయ్యకపోతే.. గ్రామాభివృద్ధి జరగదని హెచ్చరించారు. టీఆర్ఎస్ కు మెజార్టీ రాకపోతే.. బాగోదంటూ సీరియస్ గా చెప్పారు.

Latest Updates