మంత్రి సభకు స్కూల్ పిల్లలు..సర్వత్రా విమర్శలు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటనకు విద్యార్థులను తరలించడం దుమారం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ వెళ్లారు. మంత్రి వెళ్లే వరకు విద్యార్థులను ఎండలో నిలబెట్టడమే కాకుండా పిల్లలతో నాయకులపై పూలు చల్లించారు. గంటన్నరకు పైగా విద్యార్థులను  సభలో కూర్చోబెట్టారు. స్కూల్లో  పాఠాలు వినాల్సిన పిల్లలను సభలో కూర్చొబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. సభలో విద్యార్థులు ముచ్చట్లు పెడుతుంటే, అల్లరి చేస్తే మిమ్మల్నిస్కూల్ కి పంపిస్తా అని మంత్రి అనడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. స్కూల్ కి విద్యార్థులను డుమ్మా కొట్టించి ఉపన్యాసం వినడానికి పిల్లలను తరలించడమేంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Latest Updates