ఒక్కో వార్డుకు వంద ఇండ్లు కట్టిస్తం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్‍, వెలుగు: టీఆర్‍ఎస్​ క్యాండిడేట్లను గెలిపిస్తే ప్రతి వార్డుకు వంద డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నిర్మల్​ మున్సిపాలిటీ పరిధిలో ఇంద్రకరణ్​రెడ్డి, ఆయన కోడలు దివ్యారెడ్డి ఎలక్షన్​ ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ పాలనతో దేశ‌‌మంతా తెలంగాణ వైపు చూస్తోందని.. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు రెండోసారి ఆయనకు అధికారాన్ని అప్పగించారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ‌‌ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నిర్మల్​ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా టీఆర్ఎస్​ క్యాండిడేట్లను గెలిపిస్తే ప్రతి వార్డులో వంద డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు.

 

 

Latest Updates