అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం.. ఏదో పని చేసుకోవాలి

  • అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదు
  • ఇప్పటికే లక్షా 30వేల జాబ్స్ ఇచ్చినం
  • నిరుద్యోగులు వివిధ వృత్తులు.. ఇతర పద్ధతుల్లో సెటిల్ కావాలి
  • మంత్రి గుంటకంట్ల జగదీశ్‌ రెడ్డి సూచన

హాలియా, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని.. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా జనాభాలో ఒక్క శాతానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే చాన్స్ ఉంటుందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి అన్నారు. నిరుద్యోగులు వివిధ వృత్తులు, ఇతర పద్ధతుల్లో సెటిల్ కావాలని.. ఇప్పటికే లక్షా 30వేల జాబ్స్ ఇచ్చామని ఆయన అన్నారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సన్నాహక సమావేశాల్లో భాగంగా మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియా, నిడమనూరు మండలాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్​లలో పాల్గొని మాట్లాడారు. టీఆర్​ఎస్ ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని.. ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపైనే రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించామని ఇందులో కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు సాధించామని, నిధుల్లో సైతం తమ వాటా కోసం కొట్లాడుతున్నామని వివరించారు. నియామకాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. ఇందులో భాగంగా ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 50 వేల జాబ్స్ కు త్వరలో నోటిఫికేషన్​లు ఇస్తామన్నారు. అందరికీ ఉద్యాగాలు ఇవ్వడం సాధ్యంకాని విషయమని అర్హత కలిగిన నిరుద్యోగులు వివిధ వృత్తుల్లో ఇతర పద్ధతుల్లో సెటిల్ కావాలన్నారు. రాష్ట్రం 2014కు ముందు ఎలా ఉండేది ఇప్పుడెలా ఉందనేది బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఉద్యోగ ప్రకటన వెలువడినా నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్​ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

For More News..

బైడెన్ ప్రమాణం ఇయ్యాల్నే.. ప్రమాణ స్వీకారం ఇలా..

స్టూడెంట్స్ గెట్ రెడీ.. వారంలో ఇంటర్ షెడ్యూల్

కాళేశ్వరం ప్యాకేజీ 5,662 కోట్లు ఎటుపోయినయ్

Latest Updates