ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీటుకు బై ఎలక్షన్ వస్తదేమో

సీఎం మాటలు ఆయనపై వేటు వేసేలానే ఉన్నాయి: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్ వస్తుందేమోనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మిషన్ భగీరథ నీళ్లు నియోజకవర్గంలోని గ్రామాలకు రావడం లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అబద్ధాలు చెప్పారన్నారు. సీఎం మాటలు చూస్తుంటే అవాస్తవాలు మాట్లాడిన కోమటిరెడ్డి సభ్యత్వంపై వేటు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఇక కోమటి రెడ్డి బ్రదర్స్ కు ప్రగతిభవన్ గేట్లు మూసుకుపోయినట్లే. సీఎం మాటలు అదే స్పష్టం చేస్తున్నాయి. వెంకట్​రెడ్డి దీక్ష చేస్తున్నప్పుడు దొంగ దీక్షకు మద్దతు ఇవ్వొద్దని మా పార్టీ నేతలకు చెప్పిన. ఎవరూ వినలే. ఆ మద్దతుతోనే 2014లో వెంకట్​రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు’అని అన్నారు. ‘కోమటి రెడ్డి బ్రదర్స్ మైకుల ముందు ఒకటి మాట్లాడతారు. బయట మరొకటి చెప్తారు. రాజగోపాల్ రెడ్డి రెండు మున్సిపాల్టీల్లో గెలిస్తే ఆయన్ను సీఎం పార్టీలో చేర్చుకుంటడని చెప్పుక తిరిగిండు’అని విమర్శించారు. ప్రస్తుతం అసెంబ్లీలో మజా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించగా.. ‘మేం వాళ్లను పార్టీలోకి రమ్మని బతిమిలాడలే.. వాళ్లే వస్తామని రోజు నస పెడితే చేర్చుకున్నం’అని జగదీశ్ అన్నారు.

For More News..

అసెంబ్లీ సాక్షిగా.. గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్‌‌‌‌ అనేసిన ఎమ్యెల్యే

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

Latest Updates