కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు

సూర్యాపేట జిల్లా : TRS ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ రాష్ట్ర దిశ, దశ మారిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట లోని  శంకర్ విలాస్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు మంత్రి భారీ  రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. 2014 కంటే ముందు తెలంగాణ ప్రజలు ఆకలి చావులతో అలమటించారని, TRS ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ  రూపురేఖలు మారిపోయాయని అన్నారు. తెలంగాణ లోని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి.. సంక్షేమ ,అభివృద్ధి పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని, ఆయన వల్లే రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. ఆసరా పెన్షన్లు తో ప్రజల ఆత్మగౌరవం పెరిగిందని, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలతో అడబిడ్డల పెళ్లిలు సంతోషంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు.

సూర్యపేటలో కాళేశ్వరం, గోదావరి జలాలు సందడి చేస్తుంటే.. తెలంగాణ సాధించినపుడు కలిగిన ఆనందం, సంతృప్తి నేడు కలుగుతున్నదని అన్నారు జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్ లేకపోతే మరో వెయ్యేళ్లయినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావన్నారు. నేడు రాజకీయాలకు అతీతంగా సూర్యపేట ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛ గా వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారంటే అందుకు కారణం కేసీఆర్ అని అన్నారు .

రాష్ట్రాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణ లో స్థానం లేదని ప్రజలు ఎన్నో సార్లు  నిరూపించారని, హుజుర్ నగర్ ఉప ఎన్నిక  దెబ్బకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు తెరుకోలేకపోతున్నాడని మంత్రి అన్నారు. మున్సిపాలిటీ లో TRS  అభ్యర్థులను గెలిపిస్తే సూర్యపేటను మరింత అందంగా, సుందరీకరణంగా చేస్తామని జగదీశ్ రెడ్డి చెప్పారు.

More News:

 హిందూ జంటకు మసీదులో పెళ్లి చేసిన ముస్లింలు

Latest Updates