హెల్త్ చెక‌ప్ త‌ర్వాతే ఎంట్రీ

న‌ల్గొండ జిల్లా : తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద నెల‌కొన్న‌ ఇబ్బందులపై రెండు రాష్ట్రాల‌ సీఎంలు చర్చించారన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.న‌ల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ ను స్థానిక అధికారుల‌తో క‌లిసి సందర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి షరతుల గురించి చెప్పారు.

ప్రతి ప్రయానికుణ్ణి స్క్రీనింగ్ పరీక్ష చేసిన తరువాతే ఏపీలోకి అనుమతి ఇస్తారన్నారు. ఆంధ్ర రాష్ట్రం వారు చేసే హెల్త్ చెకప్ కు సహకరించాల‌ని సూచించారు. లేదా తిరుగి హాస్టళ్ల‌కు వెళ్తామన్నా ..ఏర్పాటు చేస్తామ‌ని.. ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని చెప్పారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.

Latest Updates