ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో స్పందించారు. ఇంటర్ ఫలితాల విడుదలలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ అని ఆయన అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనీ… అపోహలను నమ్మవద్దని ఆయన కోరారు. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.

విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు జగదీశ్ రెడ్డి. అనుమానాలు ఉన్న వాళ్ళు రీ వాల్యూషన్ కు అప్లై చేసుకోవాలని.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక తప్పిదాలు ఉంటే సంస్థ పైన…. మానవ తప్పిదం ఉంటే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. విద్యార్థులను ,తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని అన్నారు జగదీశ్ రెడ్డి.

Latest Updates