అర్చ‌కుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసిన కిష‌న్ రెడ్డి స‌తీమ‌ణి

హైదరాబాద్: న్యూ నల్లకుంట రామాయలయంలో 250 మంది అర్చకులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య ‘కోవిద సహృదయ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కార‌ణంగా గ‌త రెండు నెలలుగా అర్చకులు పడుతున్న బాధలను చూసి వారికి స‌రుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా  ఎవరు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశ్యంతో వివిధ సంస్థలు, అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు అందించడానికి కోవిద సహృదయ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. 250 మంది బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేసిన ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అనూహ్య రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతంరావు, అజయ్, పలువురు పాల్గొన్నారు.

minister Kishan Reddy's wife kavya distributes food items to priests in hyderabad

Latest Updates