లోకేష్ కు ఆ రెండింటికి తేడా తెలియ‌దు

అమరావతి: నారా లోకేష్ కు వరి చేనుకి, చేపల చెరువుకి కూడ తేడా తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని . శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదన్నారు. అమరావతిలో ఉన్న రైతులే రైతులు కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. అమరావతిలో భూములు కొన్నందునే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని, రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారని ఆరోపించారు. రైతులకు బేడీలు వేశారని తనకు తానుగా మాజీ మంత్రి దేవినేని ఉమ బేడీలు వేసుకొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ దేవినేని ఉమ గన్ తో కాల్చుకోవాలన్నారు.

Latest Updates