కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్

ఏపీ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్ అని ఆయన అన్నారు. చంద్రబాబును మించిన 420 దేశంలోనే లేరని ఆయన అన్నారు.
‘అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే.. ఆయనని ఎప్పుడు పదవి నుంచి దింపేద్దామా.. రాష్ట్రాన్ని ఎప్పుడు దోచుకుందామా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అమ్మ ఒడి, రైతు భరోసా అనే రెండు కొత్త పథకాల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టీడీపీ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు పంచింది. పెన్షన్లు కట్ అని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. జగన్ 420లాగా ప్రజల్ని మోసం చేస్తున్నాడని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు బతుకే 420 బతుకు. ఆయన పుట్టింది ఏప్రిల్ 20న. అంటే ఆయనే కదా పెద్ద 420. చైనాలో కరోనా వైరస్ ఉంది. రాష్ట్రంలో ఎల్లో వైరస్ ఉంది. సీఎం జగన్ వృద్ధాప్య పెన్షను వయసు పరిమితిని 65 నుంచి 60 తగ్గించారు. అందులో చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీ రావుల పేర్లను చేర్చాలి’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

For More News..

భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

ఢిల్లీ చేరిన కరోనా రెండో ఫ్లైట్

వీడియో: బావిలో పడిన కుక్కను ఓ మహిళ ఎలా కాపాడిందంటే..

రేణుకకు భవిష్యత్తు లేకుండా చేసిన రేపిస్ట్ చెన్న కేశవులు

Latest Updates