ఎక్కువ కరోనా టెస్టులు చేస్తే ప్రైజులు ఏమైనా ఇస్తారా..!

ఎక్కువ కరోనా టెస్టులు చేస్తే ప్రైజులు ఇవ్వరని అన్నారు టీఆర్ఎస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, కరోనా వైరస్, లాక్ డౌన్ తో పాటు పలు అంశాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఎక్కువ టెస్ట్ లు చేస్తే ప్రైజులు ఇవ్వరుగా

కరోనా విషయంలో ప్రతీఒక్కరు  అప్రమత్తంగా ఉంటూ, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా..ఎక్కువ కరోనా టెస్ట్ లు చేయడం లేదన్న ఆరోపణలపై స్పందించారు. ఎక్కువ టెస్ట్ చేస్తే ప్రైజులు ఇవ్వరని, ఎవరికి అవసరమో వాళ్లకే టెస్ట్ లు చేస్తున్నట్లు చెప్పారు.

ఎవరి మాట వినాలో అర్ధం కావడంలేదు

కరోనా విషయం లో ఎవరు చెప్పేది విశ్వసించాలో అర్ధం కావడం లేదన్న కేటీఆర్…మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో రాజకీయ విమర్శలు చేయకుండా.. బీజేపీతో సైద్ధాంతిక సిద్ధాంతపరంగా విభేదాలున్నా.. శుభ సమయంలో ప్రధాని మోడీకి సంఘీభావంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయని, ఆయా అంశాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ సలహాలు ఇచ్చినట్లు కేటీఆర్ చిట్ చాట్ లో వెల్లడించారు.

Latest Updates