వర్ష ప్రభావిత కాలనీలను పరిశీలిస్తున్న కేటీఆర్

హైదరాబాద్: పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రభావిత కాలనీలను మూడోరోజు పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించి అక్కడ అందిస్తున్న సౌకర్యాల పై ఆయన ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు. వరద వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ రేషన్ కిట్లతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను అందించేందుకు జిహెచ్ఎంసి ప్రయత్నం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీలు వరద నుంచి తెరుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలందరూ తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని..  కాచివడపోసిన నీటిని తాగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపడతామన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని…  షెల్టర్ హోమ్ లలో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతోపాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నామన్నారు.

 

 

Latest Updates