ప్రభుత్వానికి అంబులెన్సులను అందజేసిన కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇస్తానన్న ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను ఈ రోజు ప్రభుత్వానికి అందజేశారు. వాటిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంబులెన్స్ లు కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, బాల్క సుమన్ లతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు నాయకులు కూడా 100కు పైగా అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటిని కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు.

For More News..

అడ్డుకుంటున్నాడని లారీతో తొక్కించిన ఇసుక మాఫియా

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు

Latest Updates