ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు న‌మోదు చేసుకున్న కేటీఆర్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో మంత్రి కేటీఆర్ తన పేరును నమోదు చేసుకున్నారు. గురువారం ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని అన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు అంతా తమ పేరుని ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

Latest Updates