ప్రజలారా మీ ఆస్తుల్ని కాపాడుతాం…మద్దతు పలకండి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇస్తాం, ప్రజల ఆస్తుల పైన వారికి హక్కులు కల్పిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

ప్రజలు తమ నివాసిత ఇళ్ల హక్కుల పైన ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపాలిటీల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తుల పైన ఉన్న టైటిల్ హక్కుల సంబంధిత సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించామన్నారు.

అయినప్పటికీ కొన్ని కారణాల వలన సమస్యలు పరిష్కారం కానీ కేసుల పైన ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం మున్సిపాలిటీ లోని పేద ప్రజలకు పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతోందని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంచ్ భూమిని ప్రభుత్వ రికార్డుల కి ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలన్నారు. తమ ఆస్తుల పైన హక్కులకు భద్రత కలిగించేది ఈ చర్యను ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం 15 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులను ధరణి వెబ్ సైట్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ధరణి వెబ్ సైట్  లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.

దీంతో వారి వారి ఆస్తులకి సంపూర్ణ హక్కులు దక్కడంతో భవిష్యత్తులో క్రయవిక్రయాలకు ఎలాంటి సమస్యలు ఉండకుండా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Latest Updates