కులం, మతం అన్నం పెట్టవు, ఉద్యోగాలు తేవు

కులం, మతం అన్నం పెట్టవు, ఉద్యోగాలు తేవని అన్నారు మంత్రి కేటీఆర్. రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2020 పేరుతో ఫిల్మ్ నగర్ లో సదస్సు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ నేను వచ్చింది మీ మద్దతుకోసమే…గత ఆరేళ్లుగా చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసే ఓట్ వేయండని కోరారు.

ఆరేళ్లలో హిందు-ముస్లిం, ఆంధ్ర-తెలంగాణ లొల్లులు జరగలేదు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. సిటీలో కమ్యూనిటీ గొడవలు లేవు. కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల మాటలు అల్లర్లు చెలరేగేలా ఉన్నాయి. ఏం అభివృద్ధి చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి కానీ… హిందు-ముస్లిం అంటూ నిప్పు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వారిని ఎదురించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలంటే ప్రశాంతత వాతావరణం ఉండాలి… కానీ వాళ్ళు గెలిస్తే 100% ప్రశాంతత ఉండదని అన్నారు. వాళ్ళ ఎజెండా మతం ఒక్కటే. నేమ్ చెంజర్స్ కావాలా.. గేమ్ చెంజర్స్ కావాలో ? ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. అందుకే ఓటు వేసే ముందు ఆలోచించి వెయ్యండని కోరారు.

అరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదన్న కేటీఆర్.. మన రాష్ట్రంతో పాటు ఆంద్రప్రదేశ్ ని కూడా మోసం చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపో అర్థం కావడం లేదని అన్నారు.  కరోనా టైమ్ లో 20 లక్షల కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చింది. కానీ ఎవరికి అందయో తెలీదని చెప్పారు.

ప్రత్యర్ధులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్న ఆయన కులం, మతం అన్నం పెట్టవు, ఉద్యోగాలు తెవు. పెట్టుబడులు రావాలంటే… స్థిరమైన ప్రభుత్వం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు కేటీఆర్.

Latest Updates