సమస్యలు పరిష్కరించేందుకు సహకరిస్తాం.. మేయర్ ట్వీట్‌కు కేటీఆర్‌‌ రిప్లై

హైద‌రాబాద్: త‌మ కార్పోరేష‌న్ ప‌రిధిలోని రోడ్లు , డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌కై ప్ర‌త్యేక నిధుల కేటాయించాలంటూ సోష‌ల్ మీడియాలో జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మేయ‌ర్ కావ్య చేసిన ట్వీట్ మంత్రి కేటీఆర్ స్పందించారు. త‌ప్ప‌కుండా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు.

త‌మ ప్రాంతంలో క‌నీస స‌దుపాయాలు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. రోడ్లు పాడ‌వ‌డం వ‌ల్ల ప్ర‌జా రావాణాకు స‌మ‌స్య‌గా మారింద‌ని ట్వీట్ ద్వారా తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్య‌వ‌స్థ ప‌నులు చేయించ‌డానికి కూడా ప్ర‌త్యేక నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంద‌న్నారు. జవహర్ న‌గర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆదాయ వ‌న‌రులు కూడా అంతంత మాత్రం గానే ఉండ‌డంతో.. వ్యక్తిగత నిధులతో కొన్ని ప‌నులు పూర్తి చేశామ‌ని.. కాని అది సరిపోవ‌ని చెప్పారు. ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్.. త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేస్తామ‌ని రీట్వీట్ చేశారు.

 

Latest Updates