ప్రాణాలకు తెగిస్తున్న డాక్టర్లు, సిబ్బంది సేవలను గుర్తించాలి

కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించాలన్నారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో  72 శాతం కరోనా బాధితులు కోలుకున్నారన్నారు . రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో  లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరోనా కిట్లు,  పిపిఈ కిట్లు, 40 గ్రామాలకు బాడి ఫ్రీజలర్లు అందజేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 50 లక్షలతో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ వారికి అభినందనలు చెప్పారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బారి నుండి 80 సంవత్సరాల డయాబెటిస్ పేషెంట్ అయిన వృద్దురాలు కోలుకున్నట్లు తెలిపారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికి ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను, సిబ్బందిని అందరూ గౌరవించాలన్నారు కేటీఆర్.

Latest Updates