ఆ ఉద్దేశంతోనే బురుజుపై జెండా ఎగురవేశాం

సిద్ధిపేట: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టే దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేను ఘనంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావ్ అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన రిపబ్లికే డే ఉత్సవాల్లో హరీశ్ పాల్గొన్నారు. ‘బురుజు పై జాతీయజెండా ఎగుర వేయడం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే బురుజుపై జాతీయ జెండా ఎగురవేశాం. డాక్టర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగం రచించడం వల్ల అట్టడుగు వర్గాల వారు చట్టసభల్లో ఉన్నారు. సిద్ధిపేట పట్టణంలో పందుల బెడద పోయి కోతుల, కుక్కల బెడద పెరగడం వల్ల వాటి నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నాం. ఏ వార్డులోని చెత్త ఆ వార్డులోనే ఎరువుగా తయారు చేయడం గొప్ప విషయం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. స్కూళ్లను స్వచ్ఛ స్కూళ్లుగా మార్చుకుందాం. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఫిజికల్‌‌గా డిజిటల్ క్లాస్ ద్వారా చూపెట్టేదే స్వచ్ఛ స్కూల్. ఈ స్కూల్ దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేదు ఒక్క సిద్ధిపేటలో తప్ప. స్వచ్ఛ సర్వేక్షన్‌‌లో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం’ అని హరీశ్ పేర్కొన్నారు.

Latest Updates