కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది

హైదరాబాద్ : కలుష్యం లేని  వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్.  రాష్ట్ర ఎలక్ర్టిక్  వెహికల్ పాలసీని మంత్రి కేటీఆర్  విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్ లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. రాష్ర్టాన్ని ఎలక్ర్టిక్ వాహనాల హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ….కొత్త విధానం తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన  బాధ్యత  అందరిపై ఉందన్నారు. 2020-2030 వ‌ర‌కు ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ, వినియోగంపై విధాన‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

పాలసీ విడు‌దల కార్య‌క్ర‌మంలో నీతి ఆయోగ్‌ సీఈవో అమి‌తా‌బ్‌‌కాంత్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ పవ‌న్‌‌కు‌మార్‌ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్య‌దర్శి జయే‌శ్‌‌రం‌జన్‌, టీఎ‌స్‌‌ఐ‌ఐసీ ఎండీ ఈవీ నర్సిం‌హా‌రెడ్డి, ఎస్‌ బ్యాంకు చైర్మన్‌ సునీల్‌ మెహతా తది‌త‌రులు పాల్గొన్నారు.

 

Latest Updates