బాలికలపై వేధింపులు.. టీఆర్ఎస్ నేతపై కఠిన చర్యలు..

మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇటీవల సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో దేవయ్య అనే టీఆర్ఎస్ నేత లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలతో  మంత్రి హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బాలికలను వేధింపులకు గురిచేసిన పార్టీ నాయకులను సస్పెండ్ చేశాం. ఇలాంటి దురాగతాలకు పాల్పడే ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలి. అమ్మాయిలను వేధించిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకుంటాం. వసతిగృహాల్లో రక్షణచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates