కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Minister KTR will inaugurate the Durgam Cheruvu Cable Bridge at 5:30 pm on Friday.

హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు. రూ. 184కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జి.

కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్‌‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు.

Latest Updates