జనగామ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీ

జనగామ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. 13వ వార్డు ధర్మకంచ బస్తీలో పర్యటించిన ఆయన.. పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు బుట్టలు ఇస్తామని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. డంపింగ్‌ యార్డులో రెండు రకాల కార్యక్రమాలు చేపడతామన్నారు. తడి చెత్తతో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తామన్నారు. ఇళ్లలో చెత్త సేకరణకు రిక్షాల్లో కూడా వేర్వేరుగా డబ్బాలు ఏర్పాటు చేస్తామన్నారు. మన పిల్లల భవిష్యత్‌ కోసం మొక్కలు నాటాలన్నారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామన్నారు. పట్టణంలో 85 శాతం మొక్కలు పెరగకపోతే కౌన్సిలర్,చైర్మన్ పదవులు ఊడతాయని అన్నారు.

పట్టణాల్లో వాటర్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామన్నారు. రాబోయే రెండు నెలల్లో జనగామలో ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలన్నారు.

Latest Updates