మార్కెట్లలో కరోనా పోస్టర్లు పెట్టండి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలోని మార్కెట్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మార్కెట్లలో పోస్టర్లను ఏర్పాటు చేయాలని, మైకుల ద్వారా జాగ్రత్తలు చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. రద్దీగా ఉన్న మార్కెట్లలో మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుని ఎప్పుడూ క్లీన్​గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీలు, రైతులు, కూలీలు తరచుగా ఒకేచోట గుమిగూడకుండా చూడాలన్నారు. – నీళ్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుబజార్లు, గడ్డిఅన్నారం, బోయిన్ పల్లి, మలక్ పేట, గుడిమల్కాపూర్, మిర్యాలగూడ, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనుమాముల, ఖమ్మం, జమ్మికుంట, గజ్వేల్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మార్కెట్లలో ఖచ్చితంగా సూచించిన చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Updates