రైతు చావుపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెటకారం

రైతు చావుతో ప్రభుత్వానికి ఏం సంబంధం

సినిమా టికెట్ల లైన్లో చనిపోతే థియేటర్ యాజమాన్యంకు ఏం సంబంధం?

ఓ మీటింగ్ కు పోయి చనిపోతే.. నిర్వాహకులకేం సంబంధం ..?

రైతు గుండెపోటుతో చనిపోవడం దురదృష్టకరం.. యూరియా కోసం లైన్ లో ఉండటం యాదృచ్చికం

అగ్రిటెక్ సదస్సులో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కామెంట్స్

హైదరాబాద్ : దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన సీరియస్ విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెటకారపు మాటలు మాట్లాడారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన అగ్రిటెక్ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి.. దుబ్బాకలో యూరియా కోసం లైన్ లో రైతు చనిపోయిన విషయంపై స్పందించారు.

“యూరియా లారీలు అక్కడే ఉన్నాయి. వాటిని దించుతూ ఉన్నారు. ఇంకోపక్క రైతుల లైన్ ఉంది. అదే సమయంలో దురదృష్టవశాత్తూ.. లైన్ లో నిలబడిన రైతుకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ రైతు లైన్ లో నిలబడటం యాదృచ్చికం. అంతేతప్ప యూరియా కోసం జరిగింది కాదిది. సినిమా హాల్ కాడ కూడా పోయి నిలబడతం. టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపదొస్తే .. సినిమాది తప్పుకాదు. మీటింగ్ కు వచ్చినప్పుడు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగింది మీటింగ్ ది తప్పుకాదు. కొన్ని యాదృచ్చికమైన ఘటనలు జరుగుతుంటాయి. దాన్ని అసలు దానికి (యూరియాకు, ప్రభుత్వానికి) ముడిపెట్టడం సరికాదు. ” అని అన్నారు.

యూరియా కోసం నిలబడిన రైతులను.. సినిమా టికెట్లు, మీటింగ్ క్యూలైన్లతో పోల్చడం వివాదాస్పదమవుతోంది. వ్యవసాయ మంత్రి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలవుతున్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యత లేనట్టుగా మాట్లాడారని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు జనం.

Latest Updates