టీఆర్ఎస్‌కు, ఎంఐఎంకి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు

నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకి ఇవ్వటానికి TRS, MIM మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, నిజామాబాద్ కు కాబోయే మేయర్ టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థేనని ఆ పార్టీ నాయకుడు, మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. నిజామాబాద్ ను రూ.800 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.  అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కి , అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీకి ఓటేయాలని మంత్రి అన్నారు.

ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అరవింద్, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అబద్దాలు మాట్లాడారని, నిజామాబాద్ నగర ప్రజల మధ్య అరవింద్ చిచ్చు పెడుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అరవింద్ రోజుకో అబద్ధం చెబుతున్నారన్నారు. నగర ప్రజలు బిజెపి మాయలో పడొద్దని చెప్పారు.

బీజేపీ నాయకులు చెబుతున్నట్టుగా కేంద్రం నుంచి నిధులు ఎలాంటి రావటం లేదని, కేంద్రం ఇస్తున్న నిధులు మన హక్కు, ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు మంత్రి. టాక్స్ ల రూపంలో కట్టిన డబ్బుల నుండి 42 శాతం ఇవ్వాల్సిన వాటా మాత్రమే కేంద్రం ఇస్తుందని ఆయన అన్నారు. బీజేపీ మాయ మాటలు నమ్మొద్దని చెప్పారు ప్రశాంత్ రెడ్డి.

See More News

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

10 కోట్ల లోన్ ఇప్పిస్తానని.. కోటిన్నర కొట్టేసిన లాయర్

Latest Updates