మండలిలో క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్

గురువారం శాసన మండలిలో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ సభకు క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ అధికారులు(ED, RM, DVM), ప్రజాప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో రవాణా శాఖ మంత్రి క్షమాపణలు చెప్పారు.  సభలో మాట్లాడుతూ..  ఈ నెలాఖరు వరకు వంద ఆర్టీసీ కార్గో బస్సులను సిద్దం చేస్తున్నట్టు చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. పార్సిల్ సర్వీసుల ద్వారా 3 వందల కోట్ల ఆధాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సంస్థలో చేపట్టిన సంస్కరణల ద్వారా…రోజుకు కోటిన్నర రూపాయల వరకు లాభం వస్తోందన్నారు. గతంలో 11 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50కోట్ల ఆదాయం వస్తుందని తెలిపిన పువ్వాడ..  గత రెండు నెలలుగా ఆర్టీసీ ఆదాయంతోనే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు.

ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు  రూ. 235 కోట్లు చెల్లించడంపై ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని చెప్పారు మంత్రి అజయ్. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సిసిఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పారు. జూలై నాటికి ఖమ్మంలో అధునాతన బస్టాండ్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు మంత్రి.

Latest Updates