సొంత నిధులతో ముస్లిం కుటుంబాలకు మంత్రి పువ్వాడ రంజాన్ కానుక

రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఐదు వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోఫా రూపంలో వారికి పండుగ కానుక పంపిణీ చేశారు.

రంజాన్ పండుగను అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో త‌న సొంత నిధులతో న‌గ‌రంలోని ఐదు వేల మందికి డ్రై ఫ్రూట్స్ తో సహా పది రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి తో కలిసి శనివారం వివిధ డివిజన్లలోని ‌ ప్రతి ముస్లిం కుటుంబానికి అజ‌య్ కుమార్ నిత్యావసర సరుకులను అందించారు. లాక్ డౌన్ వేళ దాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలుసుకున్న ముస్లిం సోదరులు మంత్రి పువ్వాడకు నీరాజనాలు ప‌లికారు. ఈ మేరకు ఆయా డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు.

ముస్లిం సోదరులకు పర్వదినంగా భావించే రంజాన్ మాసంలో మానవీయ కోణంలో నిత్వావసర సరుకులు ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని పలువురు ముస్లిం పెద్దలు కొనియాడారు.

Latest Updates