బీజేపీ కార్యకర్తలు ప్రస్టేషన్‌తో నాపై దాడికి దిగారు

ఖమ్మం యువత ఉపాధి కల్పన కోసం ఐటీహబ్ నిర్మించామ‌ని, శంకుస్థాపన రోజే పది కంపెనీలతో ఒప్పందాలు జ‌రిగాయ‌ని  మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. బుధ‌వారం ఖమ్మం ఐటీ హబ్ పనులను పరిశీలించిన మంత్రి .. ఖమ్మం యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపం అని అన్నారు. కేటీఆర్ గారి సహకారంతో బాలారిష్టాలు తట్టికొని ఐటీ హబ్ నిర్మించామ‌ని, ఐటీహబ్ ఫేజ్ -2 కార్యక్రమాన్ని కేటీఆర్ చేతుల మీద మొదలుపెడతామ‌న్నారు. ప్ర‌స్తుతం 16 కంపెనీలు ఖమ్మం ఐటీ హబ్ లో పని చెయ్యబోతున్నాయని.. వేల మందికి ఉద్యోగాలు కల్పించడ‌మే త‌మ సంకల్పమ‌ని అన్నారు.

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జ‌రిగిన గొడ‌వ‌పై మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో త‌న‌ మెడికల్ కళాశాలకు వెళ్తుండగా ఫోరం మాల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు ప్రస్టేషన్‌తో త‌నపై దాడికి దిగారన్నారు అజ‌య్ కుమార్. మంత్రిగా ఉండి.. కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను ఎర్రి పువ్వు పార్టీలో లేన‌ని అన్నారు. బీజేపీ నాపై దాడి చేసిన సమయంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి దిగారని, వారు ఎక్కిన కారు త‌నది కాదని అన్నారు. త‌న‌ను చంపటానికి ప్రయత్నించారన్నారు. చెడగొట్టడం ఈజీ కానీ కానీ ఓపికగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని అజ‌య్ అన్నారు.

‘బీజేపీ నాపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్థిస్తున్నారా..?. నేనూ కమ్యూనిస్టు బిడ్డనే ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు. నారాయణ లాంటి సీనియర్ నేత అసలేం జరిగింది అనే పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం సరికాదు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. గ్రేటర్‌లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది’ అని మంత్రి పువ్వాడ అన్నారు

Latest Updates