హైదరాబాద్ లో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ డ్రైవర్లు భయపడుతున్నారు

ప్రయాణికులకు ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డీఎంలు, డీవీఎంలు, రీజనల్ మేనేజర్లతో  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈనెల 21న నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభం కానున్నందున ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పువ్వాడ . ప్రస్తుతం జిల్లాల్లో వంద శాతం బస్సులు నడుస్తున్నాయని, హైదరాబాద్ లో 40 శాతం బస్సులు నడుస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  హైదరాబాద్ లో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ డ్రైవర్లు భయపడుతున్నారని అధికారులు చెప్పడంతో..నగరంలో 100శాతం బస్సులు పూర్తిస్థాయిలో నడిపించాలని అధికారులకు  పువ్వాడ ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates