మంత్రి బైకెక్కిన హీరోయిన్

రూల్స్ పాటించకే యాక్సిడెంట్లు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో జనాభా, వాహనాల సంఖ్య పెరగడంతో పాటు రూల్స్‌ను సరిగ్గా పాటించకపోవడం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను మంత్రి అజయ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హెల్మెట్ పెట్టుకొని రాయల్‌ ఎన్ఫీల్డ్‌ నడిపారు. ఆయన వెనుక హీరోయిన్ ఈషా రెబ్బా కూర్చున్నారు. కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్ కుమార్‌, రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణ ప్రసాద్, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, కమిషనర్‌ సందీప్ కుమార్ సుల్తానియా, హీరోయిన్ ఈషా రెబ్బా పాల్గొన్నారు.

Latest Updates