
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. GHMC పోలింగ్ క్రమంలో హైదరాబాద్ లో స్థానికేతరులు ఉండొద్దని చెప్పినా.. మంత్రి పువ్వాడ ఎందుకున్నారని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పువ్వాడపై చర్చలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు నారాయణ.