అనురాగ్ వర్సిటీని ప్రారంభించిన మంత్రి సబిత

మేడ్చల్: ఘట్‌కేసర్‌‌ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఈ వర్సిటీని ఘనంగా మొదలుపెట్టారు. కార్యక్రమంలో అనురాగ్ గ్రూప్ ఆఫ్​ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్​ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పల్లా నీలిమా రెడ్డి, రాష్ట్ర స్పెషల్ చీఫ్​ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Latest Updates