రూల్స్ పాటించాలి: ఫీజుల కోసం ఇబ్బందులు పెట్టకూడదు

హైదరాబాద్: తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులు స్కూల్స్ కు హాజరవుతారన్నారు విద్యాశాఖ మంత్రి సబితఇంద్రారెడ్డి. మంగళవారం ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆమె.. ప్రైవేటు స్కూల్స్ లో విద్యార్థులకు ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ప్రైవేటు స్కూల్ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 6, 7, 8 తరగతులు కూడా ప్రారంభించాలని చెప్పారు.

దీనిపై ప్రభుత్వం ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన మంత్రి.. విద్యార్థులు క్లాసులకు హాజరకావడం తప్పనిసరి కాదనే విషయాన్ని మరోసారి చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రైవేటు స్కూల్స్ లో తప్పనిసరిగా పాటించాలని..ఫీజుల విషయంలోనూ ప్రైవేటు స్కూల్స్ విద్యార్థుల తల్లి దండ్రులను ఇబ్బందులు పెట్టకూడదన్నారు విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.

 

 

Latest Updates