తెలంగాణలో మహిళలకు మంచి అవకాశాలున్నాయి: మంత్రి సత్యవతి

చదువు తో పాటు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలంగాణ గిరిజన శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సికింద్రాబాద్ బేగంపేట్ లో ని మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభమై నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు మంచి అవకాశాలున్నాయని, విద్యార్ధులు సహనాన్ని, మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాలని సూచించారు. ప్రయివేటు కాలేజీల కంటే ధీటుగా ఈ కాలేజీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని మంత్రి సత్యవతి కొనియాడారు.

కాలేజీలో దళిత, గిరిజన వర్గానికి చెందిన విద్యార్ధినులు ఎక్కువగా ఉన్నారని, అందుకోసం వారికి హాస్టల్  ఏర్పాటు చేయాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ అడిగిన కోరికను మంత్రి మన్నించారు. ఖచ్చితంగా అది తన పరిధిలో ఉందని, కావున ముఖ్యమంత్రి తో మాట్లాడి మంజూరు చేస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. కాలేజీ భవనం గురించి కూడా  తన పరిధిలో లేకపోయినా తన సహచర, విద్యాశాఖ మంత్రి సబిత తో మాట్లాడు తానని అన్నారు.

చివరగా  తెలంగాణ మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మొదటి మహిళా మంత్రి గా తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా  సత్యవతి అభినందనలు తెలిపారు

Latest Updates