ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే

ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు మంత్రి సత్యవతి రాథోడ్.

పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ రావాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అక్టోబర్ 1వ తేద నుంచి 15వ తేదీ వరకు ఓటర్లు నమోదు కార్యక్రమంలో అందరూ భాగం కావాల‌న్న మంత్రి..ప్రభుత్వ శాఖల్లో ఎవరు పట్టభద్రులున్నా వారందరిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాల‌న్నారు.

కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడంతో దళితులు, గిరిజనులు, పేదల భూ సమస్యలను సీఎం కేసిఆర్ శాశ్వతంగా తొలగించార‌ని..వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినా వారు కోరుకున్న శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా అవకాశం ఇస్తున్నార‌ని సూచించారు.

వీఆర్ఏల‌కు కేసిఆర్ వచ్చాకే రూ .10వేల వేతనం ఇచ్చారని, ఇప్పుడు వారికి పే స్కేల్స్ ఇవ్వడం, రిటైర్ అయ్యే వారికి కుటుంబంలోని వ్యక్తి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అసైన్డ్ భూములున్న వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు…వారి భూ హక్కులు పరిరక్షిస్తాం. పోడు భూముల్లో ఉన్నవారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలిచ్చి హక్కులు కల్పిస్తామ‌ని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.

Latest Updates