మార్పు ముందుగా తల్లిదండ్రుల నుంచే మొదలవ్వాలి

యాదాద్రి భువనగిరి జిల్లా : దేశంలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు మహిళ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. భువనగిరిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ… మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు.  సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యలక్ష్మి తీసుకొచ్చారన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మొదట తల్లిదండ్రులలో మార్పు రావాలన్నారు సత్యవతి రాథోడ్. తల్లిదండ్రులు ఆడపిల్లలపై ఎలాంటి జాగ్రత్త వహిస్తారో మగ పిల్లలపై కూడా అలానే జాగ్రత్త వహించాలన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే వారు సమాజంలో ఏదైనా చేయగలరన్నారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తామని మంత్రి చెప్పారు.

Latest Updates