సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీర పెట్టిన మంత్రి సత్యవతి

రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. చీరల పంపిణీ.. బతుకమ్మ పండుగ వరకు కొనసాగనుంది. ప్రతి గ్రామంలో నాయకులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది… కోటికి పైగా బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నారు.

చీరల పంపిణీ లో భాగంగా మేడారంలో సమ్మక్క- సారలమ్మలకు బతుకమ్మ చీర పెట్టారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. అమ్మవార్లకు చీరకట్టి.. ఆలింగనం చేసుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నారు. గిరిజన బిడ్డలు, దైవ సమానులైన తల్లుల దీవెనలు.. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు మంత్రి సత్యవతి రాథోడ్.

Latest Updates