యానిమేషన్​పై సమావేశం ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

యానిమేషన్​పై సమావేశం ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: ఇండో అమెరికన్​చాంబర్​ఆఫ్​ కామర్స్​, తెలంగాణ వీఎఫ్​ఎక్స్​, యానిమేషన్  గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)  ప్రభుత్వ సహకారంతో "ది వరల్డ్ ఆఫ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ - యానిమేషన్, ఫిల్మ్  గేమింగ్" అనే అంశంపై టీ–హబ్​లో సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యానిమేషన్, గేమింగ్,  వీఎఫ్​ఎక్స్  ఫిల్మ్‌‌‌‌‌‌‌‌లలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ నుంచి హాలీవుడ్ 3,000 సినిమాల వరకు ఔట్​సోర్స్​ చేసిందని, సోనీ, కామ్‌‌‌‌‌‌‌‌కాస్ట్, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్  వార్నర్‌‌‌‌‌‌‌‌బ్రదర్స్​ వంటి పెద్ద పెద్ద కంపెనీలు మనదేశంలో ఇన్వెస్ట్ చేశాయని చెప్పారు.  

ఐటీ, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్​ మాట్లాడుతూ వీఎఫ్​ఎక్స్, యానిమేషన్  గేమింగ్‌‌‌‌‌‌‌‌లకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎకో సిస్టమ్​ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఎంతగానో సహాయం చేస్తున్నదని చెప్పారు. ఈ రంగానికి ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ సెంటర్ అయిన ఇమేజ్ ఇంక్యుబేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిందని ఆయన తెలియజేశారు.