మేడారానికి హెలికాప్టర్ సర్వీస్..టికెట్ ధరెంతంటే..

మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం కుంభమేళకు ఇప్పటి నుంచి జనం క్యూ కట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు  హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. టూరిస్టుల సౌకర్యాల కోసం బేగంపేట ఎయిర్ పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ఇవాళ జెండా ఊపి  ప్రారంభించారు. మేడారం జాతరలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం జాతరకు వరకు హెలికాప్టర్ అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.30 వేలు. అప్ అండ్ డౌన్ తో పాటు వీఐపీ దర్శనం లభించును. అలాగే మేడారం ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ కు టికెట్  ధర రూ.2999 గా నిర్ణయించారు. భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకునేందుకు 9400399999 సంప్రదించాలని కోరారు.

see more news

భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

వాటమ్మా..వాటీజ్ డేటమ్మా..!: 02-02-2020

Latest Updates